దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీలో : డిప్యూటీ సీఎం అంజాద్ భాషా
రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. విజయవాడ విద్యాధరపురంలోని మినీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 15 వేల మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్ భాషా మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీలో మైనార్టీలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. సీఎం జగన్ ప్రభుత్వంలో మైనార్టీలకు ఎంతో మేలు జరిగిందని తెలిపారు. మైనార్టీల సంక్షేమం కోసం ఎక్కువ నిధులు ఇచ్చిన రాష్ట్రం ఏపీనేనని పేర్కొన్నారు. మైనార్టీ వర్గానికి డిప్యూటీ సీఎం ఇచ్చిన ఘనత జగన్‌దేనని ప్రశంసించారు. గత ప్రభుత్వం మైనార్టీలను పట్టించుకోలేదని విమర్శించారు.













