క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పెద్దఎత్తున క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని క్రైస్తవ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనరతరం కేక్ కోశారు. కొవ్వొత్తులు వెలిగించి పాస్టర్లు, బిషప్‌లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన తేనీటి విందులో సీఎం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, మంత్రులు మేకతోటి సుచరిత, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, ఆదిమూలపు సురేష్, పలురవురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.













