ఉక్రెయిన్ నుంచి…ఏపీ విద్యార్థుల్ని సురక్షితంగా రప్పించండి : వైఎస్ జగన్
ఉక్రెయిన్‌లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను సురక్షితంగా తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు.
ఉక్రెయిన్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎంతో మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఉద్యోగాలు, ఉపాధి పొందుతూ నివసిస్తున్నారు. వారందరినీ తక్షణం ఏపీకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. ఈ విషయంలో విదేశాంగ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుంది. ఢీల్లీలోని ఏపీ భవన్‌తో పాటు అమరావతిలోని సీఎంవో కార్యాలయ అధికారులు నిరంతరం విదేశాంగశాఖతో సంప్రదింపులు చేస్తుంటారని వెల్లడిరచారు. ఇప్పటికే ఉక్రెయిన్‌లోని ఏపీ విద్యార్థులతో ప్రభుత్వాధికారులు మాట్లాడుతూ ధైర్యం చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన మేరకు అవరమైన పూర్తి సమచారాన్నీ, సహకారాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.













