అవసరమైతే నేను క్షేత్రస్థాయి పర్యవేక్షణకు వస్తాను : సీఎం చంద్రబాబు
ఫొనీ సహాయక చర్యల కోసం కొత్తగా జీవోలు జారీ చేయాల్సిన అవసరం లేదు – మళ్లీ వాటికోసం ఈసీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు – అత్యవసరాల్లో అన్నీ సంప్రదాయంగా, ముతక పద్ధతుల్లో చేస్తామంటే ప్రజలు ఇబ్బంది పడతారు – తిత్లీ సమయంలో జారీచేసిన ఆదేశాలనే ఇప్పుడు అనుసరించవచ్చు – ఈ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి – పోలింగ్ ప్రక్రియ పూర్తయినందున ఓటర్లను ప్రభావితం చేసే ప్రశ్న ఎందుకు తలెత్తుతుంది? – కష్ట సమయంలో ప్రజల ఇబ్బందుల్ని చూసి పరిష్కరించకుండా నియమావళి పేరుతో మౌనంగా ఉండిపోతే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి అర్ధమే లేదు – అవసరమైతే నేను క్షేత్రస్థాయి పర్యవేక్షణకు వస్తాను – తుఫాన్ ప్రభావిత జిల్లాలలో ఎన్నికల నియమావళిని సడలించాలని భారత ఎన్నికల సంఘానికి లేఖ రాశాను – ఇంతవరకు వారి నుంచి స్పందన లేదు – విపత్తులు ఎదురైనప్పుడు అత్యవసర సందర్భాల్లోనైనా వారు స్పందించాలి : ట్విట్లర్ లో సీఎం చంద్రబాబు













