రాబోయే 30 రోజులు అవిశ్రాంతంగా పనిచేయాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు
ఇది ఎన్నికల ఎమర్జెన్సీ సమయం. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు. ఈ నెల రోజులు ఎవరికీ సెలవులు లేవు. రాబోయే 30 రోజులు అవిశ్రాంతంగా పనిచేయాలి. ఒక్క నిముషం కూడా వృధా చేయరాదు.
‘‘మీ భవిష్యత్తు-మా బాధ్యత’’ మనందరి నినాదం
5ఏళ్లలో తలసరి ఆదాయం రెట్టింపు చేశాం.
రైతుల రాబడి 4ఏళ్లలోనే 97% పెంచాం.
మహిళల్లో, యువతలో భరోసా పెంచాం
ఖర్చులు తగ్గించాం-రాబడి పెంచాం
సంక్షేమంతో ప్రతి కుటుంబానికి భద్రత
మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేశాం
సిమెంట్ రోడ్లు,ఎల్ ఈడి బల్బులు,పారిశుద్ధ్యం
ఎక్కడ చూసినా మనం చేసిన పనులే కనిపిస్తాయి
ఈ 5ఏళ్లలో ఎంతో అభివృద్ధి,సంక్షేమం చేశాం
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం
5ఏళ్ల క్రితం చెప్పింది చేసి చూపించాం.
రాబోయే 5ఏళ్లు మళ్లీ మేమే చేస్తాం,చూపిస్తాం
5ఏళ్ల మన కష్టానికి ఈ ఎన్నికలే పరీక్ష
మనం చేసింది చెప్పాలి,ప్రజామోదం పొందాలి.













