విశాఖలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు: అవంతి
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు విశాఖలో జరపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉందని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆంధ్రా యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కాలేజీని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్య్రదినోత్సవ వేడుకల నిర్వహణకు అనుకూలమైన మైదానాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఏయూ ఇంజనీరింగ్ మైదానం, బీచ్ రోడ్ ఈ రెండు ప్రదేశాలను పరిశీలించి, వీటిలో అనుకూలమైనది ఎంపిక చేస్తామని తెలిపారు. గతంలో మాదిరిగా కాకుండా ప్రతిపక్షానికి ఎక్కువ సమయం ఇచ్చి అసెంబ్లీ నిర్వహణ అద్భుతంగా జరుగుతోందన్నారు. ప్రతిపక్ష శాసన సభ్యులు ఉన్న నియోజకవర్గాలకు త్రాగునీటి కోసం కోటి రూపాయలు నిధులు వైసీపీ ప్రభుత్వం ఇస్తోందని చెప్పారు.













