టిడిపి శ్రేణుల్లో ఇంత పోరాట పటిమ గతంలో ఎప్పుడూ చూడలేదు చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
టిడిపి నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
పాల్గొన్న బూత్ కన్వీనర్లు,సేవామిత్రలు,ఇతర బాధ్యులు
బూత్ , ఏరియా, నియోజకవర్గం 3 దశలుగా నివేదికలు పంపాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు
బాగా పనిచేసినవారు, పని చేయనివారి వివరాలు చెప్పాలి
ఓటింగ్ పెరగడానికి దారితీసిన అంశాలు వివరించాలి
ఆధిక్యతలు పెరగడానికి దోహదపడిన అంశాలు పేర్కొనాలి
అంతర్గతంగా సహకరించినవాళ్లు, వ్యతిరేకించిన వాళ్ల గురించి చెప్పాలి
పార్టీలో నాయకత్వ బేరీజుకు ఈ నివేదికలే ప్రామాణికం.
ఈ ఎన్నికల్లో కాల్ సెంటర్, కమాండ్ కంట్రోల్ రూమ్ సేవలు
ఎప్పటికప్పుడు ప్రతి దశలోనూ సర్వేలు ఉపయోగపడ్డాయి.
ఈ సర్వేలలో, విశ్లేషణల్లో వందలాదిమంది సేవలు అందించారు
యుద్దరంగంలో సైన్యంలా సిబిఎన్ ఆర్మీ పనిచేసింది
కుప్పంలోనే 3200మంది, రాష్ట్రవ్యాప్తంగా 80వేల ఆర్మీ పనిచేసింది
ఉద్యోగాలకు సెలవులు పెట్టి పార్టీకి సేవలందించారు
నిరుద్యోగులైతే పార్టీ పనే సొంతపనిగా భావించి చేశారు.
అనుబంధ సంఘాల సభ్యులంతా కలిసికట్టుగా చేశారు
పార్టీలో ప్రతి విభాగం చిత్తశుద్దితో రాత్రింబవళ్లు పనిచేసింది
జీవితంలో ఏ ఎన్నికలోనూ ఇంత పోరాటం ఎదుర్కోలేదు.
టిడిపి శ్రేణుల్లో ఇంత పోరాట పటిమ గతంలో ఎప్పుడూ చూడలేదు
కార్యకర్తలంతా ఒకరితో ఒకరు పోటిపడి పనిచేశారు.
అక్కడక్కడా నాయకుల్లో కొందరు డ్రామాలాడినా నడవలేదు.
ఒకరిని మరొకరు విమర్శించుకోవడం సరికాదు
ఇప్పుడు చేసే విశ్లేషణలన్నీ ఊహాత్మకం. రాబోయే ఎన్నికల ఫలితాలు వాస్తవికం
మీ విశ్లేషణలు, రాబోయే ఫలితాలతో బేరీజు వేసుకోవాలి
మీ విశ్లేషణ సామర్ధ్యానికి అవే గీటురాళ్లు.
ఎవరెవరు శక్తిని మించి పనిచేశారు..? శక్తి ఉన్నా ఎవరెవరు సరిగ్గా పని చేయలేదు..?
అన్నింటి సమగ్ర సమాచారం నివేదికలు పంపాలి.













