‘మహానాయకుడు’ సినిమాపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
‘మహానాయకుడు’ సినిమాపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
పాల్గొన్న టిడిపి ప్రజాప్రతినిధులు, ఇన్ చార్జ్ లు,పార్టీ బాధ్యులు
అప్పట్లో మద్రాసీలుగానే తెలుగువారికి గుర్తింపు: ముఖ్యమంత్రి చంద్రబాబు
తెలుగుజాతికి సొంత గుర్తింపు తెచ్చింది ఎన్టీఆరే.
ఎన్టీఆర్ జీవితం ప్రతి తెలుగువాడికి ప్రామాణికం
ఆ రోజూ కేంద్రంపై పోరాడాం,ఈ రోజూ కేంద్రంపై పోరాడుతున్నాం.
ఆ రోజూ విజయం సాధించాం,ఈ రోజూ విజయం సాధిస్తాం
అప్పుడు అన్యాయం జరిగింది, తిరుగుబాటు చేశాం. రాష్ట్రాన్ని,పార్టీని కాపాడుకున్నాం.
ఇప్పుడు అన్యాయం జరుగుతోంది, ఇప్పుడూ తిరగబడ్డాం, రాష్ట్రాన్ని,పార్టీని కాపాడుకుంటాం.
ఆ రోజు వినూత్న సంక్షేమం చేశాం.ఈ రోజు వినూత్న సంక్షేమం చేశాం
అప్పుడు రూ.2కిలో బియ్యం ఇస్తే ఇప్పుడు రూ.1కే కిలో బియ్యంతోపాటు పండుగ సరుకులు ఉచితంగా ఇస్తున్నాం.
ఆ రోజు పేదలకు పక్కా భవనాలు నిర్మాణం ప్రారంభం ఎన్టీఆర్ చేసిందే.
ఈ రోజు రూ.80వేల కోట్లతో 30లక్షల ఇళ్ల నిర్మాణం చేస్తున్నాం
ఎన్టీఆర్ వైద్యసేవ రూ.5లక్షలకు పెంచాం. ప్రైవేటు ఆసుపత్రులలో కాన్పులు ఉచితం చేశాం.
ఎన్టీఆర్ ఒక మహానాయకుడే కాదు ఒక సంఘ సంస్కర్త. నిరుపేదల పెన్నిధి ఎన్టీఆర్
కొందరు మనుషులు తమ సేవాభావంతో దేవుళ్లుగా మారారు. మనుషుల్లో దేవుడయ్యారు. ఆ ఘనకీర్తిని ఎన్టీఆర్ సొంతం చేసుకున్నారు.
సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు అన్నారు. ప్రజాస్వామ్య విశిష్టత ఒకే వాక్యంలో చెప్పారు.
ప్రజల కష్టాలు తొలగించారు. పేదలకు భరోసా కల్పించారు.
ఎన్టీఆర్ చూపిన దారిలోనే ఈ రోజు దేశం నడుస్తోంది
ఎన్టీఆర్ ఇచ్చిన కరెంటే ఇప్పుడు ఉచిత కరెంటు
రూ.2కిలో బియ్యమే ఇప్పుడు ఆహార భద్రతకు నాంది
ఎన్టీఆర్ చేపట్టిన పక్కాఇళ్లే ఈ రోజు దేశంలో పేదలందరికీ పక్కాభవనాలు
తెలుగుదేశం పార్టీ అంటే ఏమిటి..? టిడిపి సిద్ధాంతాలు ఏమిటి..? మహానాయకుడు సినిమా చెప్పింది.
సిద్ధాంతపరంగా టిడిపిని అర్ధం చేసుకోవాలి.
టిడిపి సిధ్దాంతాలను ముందుకు తీసుకెళ్లేందుకు ‘మహానాయకుడు’ దోహదం
తెలుగుదేశం పార్టీని ప్రజలే ఏవిధంగా కాపాడుకోగలిగారో సినిమా చూస్తే తెలుస్తుంది.
అప్పట్లో ‘ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం’ ఎలా జరిగిందో ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపారు.
161మంది ఎమ్మెల్ల్యేలను ఢిల్లీకి తీసుకెళ్లడం-రాష్ట్రపతి భవన్ లో ఎమ్మెల్యేల పేరేడ్-కేంద్రం దిగివచ్చి మళ్లీ ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి చేయడం-అన్నింటినీ కళ్లకు కట్టినట్లు ఈ సినిమా చూపింది.
ఒక దుర్మార్గాన్ని ఏవిధంగా ఎదుర్కోవాలో చేసి చూపించాం.
తెలుగుదేశం ఆవశ్యకత నాడు-నేడు-రేపు మహానాయకుడు సినిమా చాటిచెప్పింది.
మంచిని చూపేది, చెడును విసర్జించేది గొప్ప సినిమా.
‘మహా నాయకుడు’ ఆ స్థాయి సినిమా. రాష్ట్రంలో 35ఏళ్ల క్రితం జరిగిన రాజకీయ చరిత్ర
‘‘తెలుగుదేశం పిలుస్తోంది రా కదిలిరా’’ అంటే కోట్లాది మంది ఎన్టీఆర్ వెంట తరలివచ్చారు. చైతన్యరథం వెంట పరుగులు తీశారు.
విద్యార్ధులు, యువతరం తప్పకుండా చూడాలి. ఎన్టీఆర్ ఆదర్శాలను తెలుసుకోవాలి. కొత్తతరం ఓటర్లకు అప్పటి చరిత్ర తెలియాలి.
టిడిపితో కలిసి ముందుకు నడవాలి.













