నదుల అనుసంధానంతో అద్భుత ఫలితాలు : చంద్రబాబు
నదుల అనుసంధానం ద్వారా అద్భుత ఫలితాలు సాధిస్తున్నామని, దీన్ని రైతులు అనుభవిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ ప్రకాశం బ్యారేజిలోని తూర్పు కాలువ ప్రధాన స్లూయిస్ ద్వారా సాగు నీటిని మంత్రి దేవినేని ఉమాతో కలసి లాంఛనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గతంలో ఏటా జూన్లో కృష్ణా డెల్లాకు నీరు వదిలేవారని అన్నారు. తర్వాత ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల తదితర ప్రాజెక్టుల వల్ల ఎగువ నుంచి నీరు రావడమే గగనమైందన్నారు. ఫలితంగా 13 లక్షల ఎకరాల డెల్టా ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. గోదావరి నుంచి ఏటా 2,500 నుంచి 3 వేల టీఎంసీల మేర నీరు వృథగా సముద్రం లోకి పోతోందని, ఇందులో 80 టీఎంసీలను ఇపుడు పట్టిసీమ ద్వారా కృష్ణాలోకి మళ్లిస్తున్నామన్నారు.













