వెంటనే ఆ జోవోను వెనక్కి తీసుకోవాలి : సీఎం రమేష్
వైసీపీ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు లేదు అని ఆ పార్టీ ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి ధర్నాలు, బహిరంగ సభలు, కార్యక్రమాలు చేయకూడదు. చేయాల్సి వస్తే ప్రభుత్వం చెప్పిన చోట సభలు పెట్టుకోవాలని హోంశాఖ నుంచి వచ్చిన జీవోను ఖండిస్తున్నామన్నారు. వెంటనే ఆ జీవోను వెనక్కి తీసుకోవాలన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న సమయంలో ప్రతిపక్షాలు నిరసనలు తెలుపుతున్నాయి. వరదలు రాకుండా, డ్యామ్లు తెగకుండా జీవోలు ఇస్తారా? జీవో తయారు చేసిన వారు ఆర్టికల్ 19 చదువుకోవాలి అని అన్నారు. ప్రతిపక్షాలను అణిచివేయాలని చూస్తే ఇంకా తిరుగబడతాయి. ప్రభుత్వ వైఫల్యాలు తేలుసుకోకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కడం సరికాదు అని అన్నారు. కర్నూలు, హిందూపురంలో బీజేపీ కార్యక్రమాలు అడ్డుకోవడం కోసమే ఈ జీవో తెచ్చారా అని ప్రశ్నించారు. ఏ కార్యక్రమానికి అయినా ప్రభుత్వ అనుతి తప్పని సరి కానీ ఏపీలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కందుకూరు, గుంటూరు లాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి ఆలోంచాలి కానీ సభలు, సమావేశాలను అడ్డుకోవడం సరికాదన్నారు. గత ప్రభుత్వం ఇలానే వ్యవహరిస్తే జగన్ పాదయాత్ర చేసేవారు? అని ప్రశ్నించారు. ఏపీ అప్పులకు, వైసీపీ ప్రజా వ్యతిరేక పనులకు బీజేపీకి సంబంధం లేదన్నారు.













