అంత వరకు గడ్డం తీయను : సీఎం రమేష్
కడప ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన జరిగే వరకు తాను గడ్డం తీయనంటూ శ్రీవారికి మొక్కుకున్నట్లు టీడీపీ ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. తిరుమల శ్రీవారిని వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో రమేశ్‌కు ఆలయ పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రాంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రమేశ్ మీడియాతో మాట్లాడుతూ
స్టీల్‌ప్లాంట్ కోసం దీక్ష ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు తాను ఎటువంటి ఆహారం తీసుకోలేదన్నారు. ఈరోజు స్వామివారి దర్శనం తర్వాత కూడా రాజకీయ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నానని చెప్పారు. రేపు అనంతపురంలో పార్టీ తరపున ఏర్పాటు చేసిన కార్యక్రమంతో తాను పాల్గొంటున్నట్లు తెలిపారు.













