పదో రోజుకు చేరిన సీఎం రమేశ్ దీక్ష
కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభ ఎంపీ సీఎం రమేశ్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష నేటితో పదో రోజుకు చేరుకుంది. కేంద్రం నుంచి సృష్టమైన హామీ వచ్చే వరకు దీక్ష విరమించేది లేదని రమేశ్ చెబుతుండటంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఈరోజు ఉదయం రిమ్స్ వైద్యులు సీఎం రమేశ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన ఆరోగ్యం అంతకంతకూ క్షీణిస్తోందని, తక్షణ వైద్యసాయం అవసరమని సూచించారు. సీఎం రమేశ్ దీక్షకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చిన సంఘీభావం ప్రకటిస్తున్నారు. సినీ నిర్మాత బండ్ల గణేశ్ సీఎం రమేశ్‌ను పరామర్శించి మద్దతు ప్రకటించారు. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లాలకు రానున్నారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ చేస్తున్న దీక్షను విరమింపజేసే అవకాశం ఉంది.













