సీఎం రమేశ్‌కు కీలక బాధ్యతలు
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌కు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. పార్లమెంట్లో అత్యంత కీలకమైన వాటిలో పీఏసీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ) ఒకటన్న విషయం తెలిసిందే. ఈ కమిటీలో సభ్యుడిగా రాజ్యసభ తరపున సీఎం రమేశ్‌ను తీసుకున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ కమిటీలో రమేశ్‌కు చోటు దక్కింది. ఈ మేరకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నేత ఆధిర్ రంజన్ చౌదరి పీఏసీ చైర్ పర్సన్‌గా నియమితులయ్యారు. ఈ కమిటీలోనే రమేశ్ సభ్యుడిగా ఉంటారు. పీఏసీ అంటే ప్రభుత్వం చేసే ఖర్చులను పరిశీలించే కమిటీ అని అర్థం.













