అమరావతిలో నిర్మాణంలో అనస్ సంస్థ ఆసక్తి
రాజధాని అమరావతి నిర్మాణంలో పాలుపంచుకునేందుకు ఇటలీకి చెందిన ఇంజినీరింగ్, నిర్మాణ సంస్థ అనస్ ఇంటర్నేషనల్ ముందుకొచ్చింది. భారత్‌తో ఇటలీ కాన్సుల్ జనరల్ స్టెఫానియా కోస్టాంజా సారథ్యంలో ప్రతినిధుల బృందం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసింది. రష్యా, ఖతార్, లిబియాల్లో ఇప్పటికే తమ సంస్థ అనేక ప్రాజెక్టులు చేస్తోందని, భారత్‌లోనూ కార్యకలాపాలు విస్తరించాలని భావిస్తున్నామని అనస్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు తెలిపారు. దోహాలో తాము నిర్మించిన ఐకానిక్ బ్రిడ్జి గురించి వివరించారు. అమరావతిలో రహదారి నిర్మాణ ప్రాజెక్టుల్లో భాగస్వాములవుతామని తెలిపారు. కృష్ణానదిపై నిర్మించే ఐకానిక్ వారధి నిర్మాణంపై ఆసక్తి కనబరిచారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపాదిత నిర్మాణ సామగ్రి నగరం లో భాగస్వాములు కావాలని ఆ సంస్థను ముఖ్యమంత్రి కోరారు. రాజధానిలో ఏయే అంశాల్లో సహకరించేందుకు అవకాశాలున్నాయో సీఆర్డీఏ అధికారులతో చర్చించి, నిర్దిష్ట ప్రతిపాదనలతో రావాలని సూచించారు.













