కామన్‌వెల్త్ విజేత రేవతికి సీఎం నజరానా

కామన్‌వెల్త్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు సాధించిన ఘట్టమనేని సాయి రేవతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసింది. ఈ సందర్భంగా సాయి రేవతికి రూ.5 లక్షల నజరానాను ముఖ్యమంత్రి ప్రకటించారు.అలాగే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకుగాను ఆమెకు తగిన శిక్షణ అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. తెనాలి ఇండోర్ స్టేడియానికి అవసరమయిన మౌలిక సదుపాయాల కోసం 25 లక్షలు మంజూరు చేశారు.