నాకు ప్రాణ సమానమైన జిల్లా పశ్చిమగోదావరి : చంద్రబాబు
పశ్చిమ గోదావరి జిల్లాల కార్యకర్తలతో సీఎం చంద్రబాబు
ఏలూరు, నర్సాపూర్ పార్లమెంట్ నేతలతో చంద్రబాబు భేటి
నాకు ప్రాణ సమానమైన జిల్లా పశ్చిమగోదావరి
15మంది ఎమ్మెల్యేలు,3పార్లమెంట్లు, మేయర్లు, ఛైర్మను గెలిపించారు
ఏకపక్షంగా మొత్తం జిల్లాలో టిడిపిని గెలిపించింది పశ్చిమగోదావరి
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆదరించిన జిల్లా
1989లో కూడా 8సీట్లు గెలిపించిన జిల్లా
ఎక్కువ సార్లు పర్యటించించి పశ్చిమగోదావరిలోనే
66.5% పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యింది.
ప్రతి ఎకరానికి నీళ్లిచ్చే బాధ్యత తీసుకుంటాను
మీ అభిమానం మరువలేనిది.
జిల్లాలో రెండవ పంటకు నీరిచ్చింది ఎన్టీఆరే.
డెల్టా ఉన్నప్పటికీ జిల్లాలోని మెట్టప్రాంతాలలో నీటి ఇబ్బంది
పోలవరం పూర్తయితే ప్రతి ఎకరానికి సాగునీరు
ఈ జిల్లాలో అనేకం చేశాం, ఇంకా చేయాల్సిందేమీ కనిపించడంలేదు
మరుగుదొడ్లు,సిమెంట్ రోడ్లు,అంగన్ వాడి భవనాలు
టిడిపికి బ్రహ్మరథం పట్టిన జిల్లా
పశ్చిమ గోదావరికి ప్రభుత్వ తొలి ప్రాధాన్యత
ఏలూరులో మెడికల్ కాలేజి ఏర్పాటుకు నిర్ణయం
ఆక్వాకు యూనిట్ రూ.6.40 నుంచి రూ.2కు తగ్గింపు
రూ.5వేల కోట్లతో చింతలపూడి ఎత్తిపోతల పథకం తెచ్చాం
మూడవ కాంటూరుకు కుదింపు పై కేంద్రానికి పంపాం
కొల్లేరు రైతులను తప్పకుండా ఆదుకుంటాం
గతంలో క్రాప్ హాలిడే ప్రకటించిన జిల్లా
జాతీయ నాయకులతో కలిసి పర్యటించాను
పాదయాత్రలో రైతుల్లో భరోసా నింపాను
రూ.24వేల కోట్ల రుణమాఫీ రైతులకు చేశాం
అన్నదాత సుఖీభవ కింద రూ.15వేలు ఇస్తున్నాం
కేంద్రం ఇవ్వకపోయినా కౌలు రైతులకు మనం ఇస్తున్నాం
5ఎకరాల పైబడిన రైతులకు మనం ఇస్తున్నాం
ప్రతి యువతకు నేనే గార్డియన్ గా ఉంటాను.
యువత నైపుణ్యాలను పెంచుతాను.
నెలకు యువనేస్తం భృతి కూడా రూ.2వేలకు పెంచాం.
ఎన్టీఆర్ వైద్యసేవ రెట్టింపు చేశాం. రూ.2,50,000నుంచి రూ.5లక్షలకు పెంచాం
4.5లక్షల మందికి నెలకు రూ.2వేలు పెన్షన్లు ఇస్తున్నాం.
జిల్లాలో ఏడాదికి రూ.1,080కోట్ల పించన్లు ఇస్తున్నాం
జిల్లాలో పసుపు-కుంకుమ కింద రూ.1200కోట్ల లబ్ది.
డ్వాక్రా మహిళలకు 2దశలుగా రూ.20వేలు ఇచ్చాం
6,35,000మంది మహిళలకు ప్రభుత్వలబ్ది
బ్యాంక్ లింకేజి కింద రూ.5వేల కోట్ల రుణాలు ఇప్పించాం.
రూ.585కోట్ల వ్యయంతో పేదలకు 71వేల ఇళ్ల నిర్మిస్తున్నాం.
అభివృద్ధిలో, సంక్షేమంలో తెలంగాణ కంటె ఏపి ముందుంది
విభజన వల్ల నష్టాన్ని స్వయంకృషితో అధిగమిస్తున్నాం
సైబరాబాద్ అభివృద్ధి చేసింది తెలుగుదేశమే
అహ్మదాబాద్ కు హైదరాబాద్ కు పోలిక ఉందా
అదే నరేంద్రమోదికి భయం మనం అంటే
అందుకే మట్టి,నీళ్లు మన ముఖాన కొట్టారు
అమరావతి స్థానబలం ఉంది, ఆ శక్తి ఈ ప్రాంతానికి ఉంది
ఆంధ్రప్రదేశ్ మట్టి,నీళ్ల మహిమ చూపిస్తాం
గ్రాఫిక్స్ అని ఎగతాళి చేస్తున్నారు కొందరు
దేనికైనా ప్రారంభం గ్రాఫిక్సే
కళ్లు తిరిగి కిందపడే రోజు తొందర్లోనే ఉంది
నేను పిలుపిస్తే రైతులు 34వేల ఎకరాలు ఇచ్చారు
అదే జగన్మోహన్ రెడ్డి పిలుపిస్తే ఎవరైనా ఇస్తారా..?
సింగపూర్ మాస్టర్ ప్లాన్ ఇచ్చిందంటే మన విశ్వసనీయతే
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు
అభ్యర్ధి ఎవరో చూడకుండా గెలిపించారు
తాడేపల్లి గూడెం అభ్యర్ధిని అందుకే గెలిపించాం
అభ్యర్ధులు బలహీనంగా ఉన్నా గెలిపించారు
ఇప్పుడదే వ్యక్తి మనలను విమర్శిస్తున్నాడు
వార్డులో మెంబర్లు కూడా బిజెపి గెలవలేదు
అలాంటిది ఎమ్మెల్యేగా,ఎంపిగా గెలిపించాం
ప్రజల విశ్వాసాన్ని బిజెపి వమ్ము చేసింది.
ఈ పార్టీని 37ఏళ్లుగా కాపాడింది మీరు
కష్టం కార్యకర్తలది, తెలుగుదేశం కార్యకర్తలపార్టీ
అంకిత భావానికి మారుపేరు టిడిపి కార్యకర్తలు
కార్యకర్తల కష్టం వల్లే టిడిపి తిరుగులేని శక్తిగా తయారైంది.
ఆస్తులు అమ్ముకుని పార్టీని నిలబెట్టారు.
కుటుంబంతో కన్నా మీతో గడిపితేనే ఆనందం
సొంత కుటుంబం కంటే ఎక్కువ సేవలు చేసింది మీరు
ఎన్టీఆర్ కు, నాకు గుర్తింపు వచ్చిందంటే మీ వల్లే
అందుకే కుటుంబం కన్నా మీరంటేనే మక్కువ
భారత విమానదళం ధైర్యసాహసాలను ప్రశంసించాం
మన సైనికులకు సంఘీభావంగా నిలబడ్డాం.
అప్పుడూ పుల్వామా ఉగ్రదాడిని వెంటనే ఖండించాం
ఒక్కో జవాన్ కుటుంబానికి రూ.5లక్షలు ప్రకటించాం.
మన ఉద్యోగులకు జవాన్ల కుటుంబాలకు రూ30కోట్లు ఇచ్చారు
దేశభక్తిలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుంది.
దేశభద్రతలో టిడిపి ఎప్పుడూ రాజీపడదు
రౌడీయిజానికి,తీవ్రవాదానికి టిడిపి వ్యతిరేకం
రౌడీ అనేవాడు ఈ రాష్ట్రంలో ఉండకూడదు
రాష్ట్రంలో రౌడీరాజ్యం తేవాలని వైసిపి చూస్తోంది
హైదరాబాద్ లో మతకలహాలు వైసిపి ఘనతే
ఈ రోజు అంతా మార్పింగ్ రోజులు వచ్చాయి.
వైసిపి మార్ఫింగ్ మాఫియాగా మారింది.
తలకాయలు మార్చేస్తారు, మన మాటలను మార్చేస్తారు
కొండవీడు రైతును పోలీసులే చంపేశారని దుష్రచారం
చనిపోయిన రైతుకు కులముద్ర వేశారు
చంద్రగిరిలో ఎర్రచందనం స్మగ్లర్ల అరాచకాలు
టిడిపి అధికారంలోకి రాగానే అడ్డుకట్ట వేశాం
ఫ్రస్టేషన్ తోనే రెడ్ శాండల్ స్మగ్లర్ల దాడులు
పోలవరం కుడికాలువకు గండి కొట్టారు
గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి సుప్రీంకోర్టుదాకా కేసులు
రాజధానిలో అరటితోటలు తగులపెట్టారు
పంట పొలాల్లో బోర్లు ధ్వసం చేశారు
విశాఖ ఎయిర్ పోర్టులో పోలీస్ అధికారిని బెదిరిస్తాడు
ఆసుపత్రిలోకృష్ణా జిల్లా కలెక్టర్ నే బెదిరిస్తాడు
తునిలో రైలు తగులపెట్టారు, పోలీస్ స్టేషన్లలో విధ్వంసం చేశారు
కాపు రిజర్వేషన్లతో నాకు సంబంధం లేదంటాడు
గండికోట రిజర్వాయర్ లో నీళ్లు పెట్టనివ్వరు
తప్పుడు సర్వేలతో వైసిపి దుష్ప్రచారం
బండారం బైటపడుతుందనే ఇతర సర్వేలకు అడ్డంకులు
సర్వేలు చేసేవాళ్లపై వైసిపి దాడులు చేస్తుంది.
ట్యాబ్ లు లాక్కోవడం, కిడ్నాప్ చేయడం వైసిపి దుర్మార్గం.
ఎన్నికకో అభ్యర్ధిని మార్చేసే పార్టీ వైసిపి
గత ఎన్నికల్లో అభ్యర్ధులు ఈ ఎన్నికల్లో కనబడరు
పశ్చిమ గోదావరిలో ఇంకా చేయాల్సింది పారిశ్రామికీరణే
15 నియోజకవర్గాలలో ఎంఎస్ ఎంఈ పార్కుల ఏర్పాటు
వ్యవసాయంలో, హార్టీకల్చర్ లో ముందున్నారు,
పరిశ్రమల్లో కూడా పశ్చిమ గోదావరి ముందుండాలి
గత ఎన్నికల్లో అద్భుతమైన గెలుపునిచ్చారు
రాబోయే ఎన్నికల్లో దాన్ని మించిన గెలుపు తథ్యం
2ఎంపి సీట్లు, 15 అసెంబ్లీ స్థానాల్లో టిడిపి గెలవాలి
చరిత్రలో లేనంత మెజారిటితో టిడిపి గెలిపించాలి
పార్టీలో పని చేసేవాళ్లకే పదవులిస్తాం.
అన్ని స్థాయిల్లో నాయకత్వాన్ని పెంచుతాం
రాబోయే 6 నెలలు వరుసగా ఎన్నికలే.
అనేక పదవుల్లో మీ అందరికీ గొప్ప అవకాశాలు
ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా 250మందికే అవకాశం
జడ్ పి ఛైర్మన్లు,మేయర్లు,ఛైర్మన్లుగా అవకాశాలు
నామినేటెడ్ పోస్ట్ లలో మరెందరికో అవకాశం
నా సొంత కుటుంబ సభ్యులు మీరంతా.
మనం అందరం తెలుగుదేశం కుటుంబం
65లక్షల కుటుంబ సభ్యులున్న పార్టీ టిడిపి
మీ అందరినీ పైకితెచ్చే బాధ్యత నాదే
మీ కుటుంబాలకు చేయూత బాధ్యత నాదే
ప్రజలను మెప్పించే బాధ్యత మీదే.
అరాచక శక్తులు వస్తే అభివృద్ధి ఆగిపోతుంది
రౌడీలు వస్తే పేదల సంక్షేమం ఆగిపోతుంది.
వైసిపి వస్తే అరాచకం, అవినీతి-అక్రమాలే.
కాలచక్రం మన చేతుల్లో లేదంటారు
భవిష్యత్తు చక్రం మాత్రం మీ చేతుల్లోనే ఉంది
టిడిపిని గెలిపిస్తేనే అభివృద్ది,సంక్షేమం
ఈ 5ఏళ్ల అభివృద్ధి మరో 10కాలాలు కొనసాగాలి
మీ భవిష్యత్తే కాదు, రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల్లోనే
గెలుపే మన ఆలోచన, మెజారిటియే మన ఆలోచన
కార్యకర్తలు ఒకరితో ఒకరు పోటీబడాలి.
పోటీబడి పనిచేసి పార్టీని గెలిపించాలి.
15 నియోజకవర్గాలు ఒకదానితో మరొకటి పోటీబడాలి.
అన్ని మండలాలు ఒకదానితో ఒకటి పోటీబడాలి.
గతం కన్నా రెట్టించిన ఆధిక్యత రావాలి.
మెజారిటీని బట్టే భవిష్యత్తులో పదవులు













