కరోనా టెస్ట్ లు చేసే వాళ్లకు జగన్ సర్కార్ స్ట్రాంగ్ వార్నింగ్
ఒక పక్కన కరోనాతో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నా సరే ప్రైవేట్ ఆస్పత్రుల తీరు మాత్రం ఏ విధంగా మారడం లేదు. ఎన్ని విధాలుగా హెచ్చరించినా సరే కరోనా పరీక్షా నుంచి వైద్యం వరకు కూడా ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. దీనిపై ఏపీ సర్కార్ చాలా సీరియస్ గా ముందడుగు వేస్తుంది. తెలంగాణా హైకోర్ట్ కూడా ఇప్పటికే కొన్ని సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే ఏపీలో ప్రైవేట్ లాబ్ లకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ప్రైవేటు ఆర్ టి పి సి ఆర్ ల్యాబ్ లకు హెచ్చరికలు జారీ చేసారు.
గవర్నమెంటు సూచించిన రూ. 499 కు మించి వసూలు చేస్తే రిజిస్ట్రేషన్ రద్దు చేస్తాం అని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సిఇవో మల్లికార్జున హెచ్చరించారు. కొత్తగా ఐ సి ఎం ఆర్ ఆర్ -ఎన్ ఏ బి ఎల్ అనుమతి పొందిన ప్రైవేటు ఆర్ టి పి సి ఆర్ ల్యాబ్ లు వెంటనే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ను సంప్రదించచాలి అని ఆదేశాలు జారీ చేసారు. ఎం ఎన్ ఎస్ పోర్టల్ లాగిన్ లు పొందాలి అని ఆయన సూచించారు. లాగిన్ ఐ డి కోసం ceoap@ysraarogyasri.ap.gov.in, sai.abhishek79@gmail.com ఇమెయిల్ లకు సంప్రదించాలి అని తన ప్రకటనలో వెల్లడించారు.
పరీక్షలు జరిపిన వెంటనే ఏరకమైన ఫలితమైనా వెంటనే ఎం ఎన్ ఎస్ పోర్టల్ నందు నమోదు చేయాలి అని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేయడం చట్టవిరుద్ధం అని తన ఆదేశాల్లో ఆయన వివరించారు. వీటి కొరకు ఎన్ ఏ బి ఎల్ గుర్తింపు కలిగిన హాస్పిటల్ లేదా ల్యాబ్ లు తక్షణమే ceoap@ysraarogyasri.ap.gov.in, drgsudhakarcollege@gmail.com ఇమెయిల్ లకు సమాచారమిచ్చి అనుమతులు పొందాలి అని సూచనలు చేసారు.
అనుమతి ఉన్న ల్యాబ్ లు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టుల ఫలితాల్ని వెంటనే ఎం ఎన్ ఎస్ పోర్టల్ నందు నమోదు చేయాలి అని స్పష్టత ఇచ్చారు. లేనిపక్షంలో వారి రిజిస్ట్రేషన్ రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు అని హెచ్చరించారు. అదే విధంగా అర్హతలేని సంస్థలు ర్యాపిడ్ యాంటిజన్ టెస్టులు చేయకూడదు అని ఆదేశించారు. 1902 కు ఫిర్యాదు చెయ్యొచ్చు అని తెలిపారు.













