కడప స్టీల్ ప్లాంట్ కు సీఎం జగన్ శంకుస్జాపన
వైఎస్ఆర్ జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు. జిందాల్ స్టీల్ చైర్మన్ సజ్జన్ జిందాల్లతో కలిసి సీఎం శంకుస్జాపన చేశారు. అనంతరం ఉక్కు పరిశ్రమ నమూనాను జగన్ పరిశీలించారు. పరిశ్రమ వివరాలు సీఎంకు జిందాల్ వివరించారు. ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి జేఎస్డబ్ల్యూ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఒప్పందం చేసుకుంది. జమ్మలమడుగు మండలం సున్పపురాళ్లపల్లె-పెద్ద దండ్లూరు గ్రామాల మధ్యలో 3,591,65 ఎకరాల్లో రూ. 11,606 కోట్లతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరిశ్రమ స్థాపనకు తొలుత 2007 జూన్ 10న అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అనంతరం 2018 డిసెంబరు 27న అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం జగన్ 2019, డిసెంబరు 23న ఒకసారి శంకుస్థాపన చేశారు. తాజాగా మరోసారి భూమిపూజ చేయడం గమనార్హం.













