విశాఖ శారదా పీఠాన్ని సందర్శించిన సీఎం వైఎస్ జగన్
విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్శించారు. పీఠం వార్షిక మహోత్సవం సందర్భంగా అక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రికి శారదా పీఠం ప్రతినిధులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రాజశ్యామల అమ్మవారిని జగన్ దర్శించుకున్నారు. శారదాపీఠం ప్రాంగణంలో గోమాతకు జగన్ పూజలు చేశారు. ఈ సందర్భంగా పీఠం నిర్వహించే యజ్ఞ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, మేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉనాన్నారు.













