రెండో విడత వైఎస్ఆర్ ఆసరా ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
వైఎస్ఆర్ ఆసరా రెండో విడత కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒంగోలులో ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ దేవీ నవరాత్రుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం శుభపరిణామమని తెలిపారు. ఈ నెల 13, 14న పండుగ కారణంగా అర్హుల ఖాతాలో నగదు జమ అవ్వదన్నారు. అలాగే కడప జిల్లాలో ఎన్నికల కోడ్ ఉన్నందున ఆ జిల్లాకు చెందిన వారికీ నగదు ఖాతలో జమ అవ్వదని తెలిపారు. రాష్ట్రంలో 61 లక్షల మందికి పింఛను ఇస్తున్నాం. 7.97 లక్షల సంఘాల్లోని 78.76 లక్షల మంది మహిళల పొదుపు ఖాతాల్లో రూ.6,439 కోట్లను జమ చేయనున్నామని తెలిపారు.
ప్రభుత్వ చొరవతో 3 లక్షలకు పైగా మహిళలు వివిధ వ్యాపారాలు ప్రారంభించారు. నెలకు రూ.7 వేల నుంచి రూ.10 వేలకు పైగా అదనపు ఆదాయం పొందుతున్నారు. హోంమంత్రిగా తొలిసారి మహిళకు అవకాశం ఇచ్చామన్నారు. ఒంగోలు పట్టణంలో తాగునీటి కోసం రూ.400 కోట్ల ప్రాజెక్టు మంజూరు చేస్తున్నాం. వెలిగొండ పనులను ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది. రెండో టన్నెల్ పనులు శరవేగంగా చేస్తున్నాం. 2022 ఆగస్టు నాటికి మొదటి టెన్నల్ నుంచి నీటిటి విడుదల చేస్తామని తెలిపారు. జగనన్న కాలనీల ద్వారా 1.25 కోట్ల మందికి లబ్ధి చేకూరింది. రాష్ట్రంలో 67.47 శాతం పదవులు మహిళలకు కేటాయించాం. రాష్ట్రంలో రూ.1450 కోట్లు ఖర్చు చేసి 61 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. రాష్ట్రంలో కొత్తగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామని తెలిపారు.













