విశాఖ శారదా పీఠంలో సీఎం జగన్ ప్రత్యేక పూజలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖలోని శ్రీ శారదా పీఠాన్ని సందర్శించారు. ప్రత్యేక విమానంలో తాడేపల్లి నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన అక్కడ నుంచి రోడ్డు మార్గంలో పెందుర్తి మండలం చినముషిడివాడలోని శారద పీఠానికి చేరుకున్నారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం సంప్రదాయ వస్త్రాలు ధరించి పీఠం అధిదేవత రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. స్వరూపానందేంద్ర, పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వాములు సీఎంతో రాజశ్యామల యాగం, మన్యుస్తూక హోమం, దాసాంజనేయ స్వామి, శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు చేయించారు. తరువాత స్వరూపానందేంద్ర సరస్వతితో సీఎం సుమారు అరగంట పాటు ఆంతరంగిక చర్చల్లో పాల్గొన్నారు.













