వైఎస్ జగన్ కీలక నిర్ణయం
రాష్ట్రం అప్పుల్లో ఉన్న నేపథ్యంలో ఆదాయ మార్గాలను అన్వేషించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. ఆర్థిక, రెవెన్యూ శాఖలపై తన నివాసంలో సమీక్షించిన ఆయన.. రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మద్యపానం నిషేధం అమలుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేదం అమలుకు చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. దీనికి ఎలాంటి కార్యాచరణ చేపట్టాలో అన్వేషించాలని అధికారుల్ని సూచించారు. మద్యపానాన్ని నిరుత్సాహపరిచేలా కార్యాచరణ ఉండాలని చెప్పారు. గొలుసు దుకాణలపై నివేదిక ఇవ్వాలని అదేశించారు. ఆర్థిక క్రమశిక్షణ విషయంలో రాజీపడొద్దని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. రాష్ట్రం ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లాల్సిన అగత్యం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. వడ్డీలు కట్టేందుకు కూడా అప్పులు ఎందుకు చేస్తున్నామని ముఖ్యమంత్రి నిలదీశారు.













