భారత్ బయోటెక్, హెటెరో డ్రగ్స్ కంపెనీలకు సీఎం జగన్ ఫోన్
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ కీలక అడుగు వేశారు. వ్యాక్సిన్ల కొరతను అధిగమించడానికి కీలక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సీఎం జగన్ భారత్ బయోటెక్ ఎండీ కృష్ణా ఎల్లా, హెటెరో డ్రగ్స్ ఎండీ పార్థసారథికి ఫోన్ చేశారు. ఈ ఇద్దరితో సీఎం జగన్ ఫోన్లో మాట్లాడారు. రాష్ట్ర అవసరాలు తీర్చే విధంగా మరిన్ని కోవిడ్ వ్యాక్సిన్ డోస్‌లతో పాటు, రెమిడేసివిర్ ఇంజక్షన్లను సరఫరా చేయాలని ఆ ఇద్దర్నీ సీఎం జగన్ కోరారు. మరోవైపు ఏపీలో కరోనా వ్యాప్తిపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని పరిస్థితిపై మంత్రుల కమిటీ సీఎం జగన్‌కు వివరించింది. మరోవైపు ఆక్సిజన్ సరఫరా, రెమిడేసివిర్, పడకల అందుబాటు తదితర అంశాలపై జగన్ సమీక్ష నిర్వహించారు.













