సీఎం జగన్ కీలక నిర్ణయం… సంగం బ్యారేజీకి
నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజీకి మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును పెడతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరులో గౌతమ్‌రెడ్డి సంస్మరణ సభకు జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా ప్రతి అడుగులో గౌతమ్‌రెడ్డి తోడున్నారు. గౌతమ్‌రెడ్డి నన్ను ఎప్పుడూ ప్రోత్సహించేవారు. గౌతమ్ నాకు మంచి మిత్రుడు అని పేర్కొన్నారు. ఆయన మృతి వారి కుటుంబానికి తీరని లోటన్నారు. ప్రజల గుండెల్లో గౌతమ్ చిరస్థాయిగా ఉండేందుకు, సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరుతో నామకరణం చేస్తామని ఆయన ప్రకటించారు. మే 15 వరకు సంగం బ్యారేజీని పూర్తి చేస్తామన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ గౌతమ్ రెడ్డి కుటుంబానికి తోడుగా ఉంటుందన్నారు. పరిశ్రమల శాఖ మంత్రిగా రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ఆయన చివరి క్షణం వరకు కృషి చేశారు అని తెలిపారు.













