తెలంగాణ గవర్నర్తో ఏపీ సీఎం భేటీ
తెలంగాణ గవర్నర్ నరసింహన్తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. రాజ్భవన్లో నరసింహన్ను జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. సుమారు గంటకుపైగా ఈ ఇద్దరి మధ్య పలు కీలక విషయాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి రాష్ట్రం ఆస్తులు, నీటి పంపకాలపై కీలకంగా చర్చించినట్లు సమాచారం. ఈ నెలలో నీటి పంపకాలు, ఆస్తులపై ఇరు రాష్ట్రాల అధికారులు భేటీ కానున్న నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్నది. ఏపీకి కొత్త గవర్నర్ హరిచందన్ రాక మునుపు నరసింహన్ తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్గా వ్యవహరించిన విషయం విదితమే.













