హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) ప్రశాంత్ కుమార్ మిశ్రతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ నెల 30న ఢిల్లీలో జరగనున్న వివిధ రాష్ట్రాల హైకోర్టుల సీజేలు, సీఎంల సమావేశ ఎజెండాపై చర్చించారు. 2016 ఏప్రిల్ 4న జరిగిన సీఎంలు, హైకోర్టు సీజేల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు తీరుపై ఢిల్లీలో జరిగే సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రం తరపున అక్కడ సమర్పించనున్న నివేదిక గురించి ముఖ్యమంత్రి, సీజే మిశ్ర సమీక్షించారు. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ఉన్నతాధికారులు, హైకోర్టు పరిపాలనా విభాగం ఉన్నతాధికారులు పాల్గొన్నారు.













