సీఎం జగన్‌కు ఎంపీల అభినందన
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశ పెడుతున్నందుకు ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అభినందనలు తెలిపారు. అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి సరస్వతీదేవి విగ్రహాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. సమావేశానంతరం వైకాపా లోక్‌సభాపక్షనేత పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీలు మార్గాని భరత్, సత్యవతి మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం గత అయిదేళ్లూ పార్లమెంట్లో పోరాడమని, ఇప్పుడూ కేంద్రంపై ఒత్తిడి తెస్తామని మిథున్‌రెడ్డి చెప్పారు. బీజేపీకి పూర్తి మెజారిటీ ఉన్నందువల్ల మేం 22 మంది ఎంపీలం ఉన్నా మా సంఖ్యాబలం వారికి అవసరం లేకపోయింది. అయినా హోదా విషయంలో ఇచ్చినమాట నిలబెట్టుకోవాలని బీజేపీ ప్రభుత్వాన్ని గత సమావేశాల్లోనూ అడిగాం. ఇప్పుడు అడుగుతాం అని వెల్లడించారు. భరత్ మాట్లాడుతూ ప్రత్యేకహోదా కంటే ముందు విభజనచట్టంలోని హామీలను సాధించుకుంటూ దాంతోపాటు ప్రత్యేకహోదా కోసం మేం పోరాడతాం అని చెప్పారు.













