వైఎస్ఆర్ కంటి వెలుగు ఫేజ్-3 ప్రారంభం
మూడో దశ వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వర్చువల్గా ఫేజ్-3ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ చూపు కొద్దిగా మందగించినా జీవనం కష్టమవుతూ ఉంటుందని, రాష్ట్ర ప్రజల కంటి చూపు పరిరక్షణకు చోటిచ్చామన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ కంటి వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించామన్నారు. ఇందుకోసమే వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఆరు దశల్లో చేపట్టిన ఈ కార్యక్రమంలో తొలి రెండు దశల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 66.17 లక్షల మంది పిల్లలను పరీక్షించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి విడుదల రజని, సీఎస్ జవహర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.













