ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన
విజయవాడ ఇంద్రకీలాద్రి వద్ద పలు అభివృద్ధి పనులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వీటి వ్యయం రూ.216.05 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. తొలుత తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరిన సీఎం జగన్ విజయవాడ కనకదుర్గానగర్‌కు చేరుకున్నారు. అక్కడ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవాదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలైవన్, కమిషనర్ ఎస్.సత్యనారాయణ, దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో రామారావు తదితరులు సీఎం జగన్‌కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం దుర్గగుడి మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా చేపట్టనున్న అభివృద్ధి పనులకు జగన్ శంకుస్థాపనలు చేశారు.













