అంబేడ్కర్ రాజ్యాంగాన్ని కాదు.. రాజారెడ్డి రాజ్యాంగం
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మూడేళ్ల పాలనపై ప్రజలు విసిగిపోయారని అన్నారు. మూడేళ్లుగా టీడీపీ నేతలు, కార్యకర్తలను వేధించిన ప్రభుత్వం ఇటీవల కాలంలో సామాన్య ప్రజలను ఇబ్బందులను గురిచేస్తున్నారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు. వైసీపీ పాలకులను తరిమితరిమికొట్టడం కూడా ప్రారంభమైందన్నారు. గడచిన మూడేళ్లలో రాష్ట్రంలో నాలుగు వేల మంది టీడీపీ కార్యకర్తలు 55 మంది సీనియర్ నాయకులను వేధించడంతో పాటు పలు రకాల కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారని తెలిపారు.













