నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ అబ్ధుల్ నజీర్ దంపతులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు రాజ్‌భవన్‌లో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. రేపు 24వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్ భవన్లో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి చకాచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా నూతన గవర్నర్‌గా నియమితులైన జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్‌కు సీఎం జగన్ సాదర స్వాగతం పలికారు. జస్టిస్ అబ్దుల్ నజీర్, ఆయన కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి 8:15 గంటలకు ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు.













