పవన్ కల్యాణ్ పై సీఎం జగన్ మరోసారి
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి తన స్థాయి మరిచి వ్యక్తిగత విమర్శలకు దిగారు. కాకినాడ జిల్లా సామర్లకోట సభలో ఈ మేరకు జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, ఆయనను సమర్థించే నాయకులెవరూ ఆంధ్రప్రదేశ్‌లో ఉండరు. ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ ఇల్లు కూడా హైదరాబాద్‌లోనే. కానీ ఆ ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3-4 ఏళ్లకోసారి మారుతూ ఉంటారు. ఒకసారి లోకల్, ఇంకోసారి నేషనల్, మరోసారి ఇంటర్నేషనల్. ఆడవాళ్లన్నా, పెళ్లిళ్ల వ్యవస్థ అన్నా పవన్‌కు గౌరవం లేదు అని అన్నారు.












