ఎన్నారై టీడీపీ డిజిటల్ ప్రచార రథాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి
రాష్ట్రంలో 10 ప్రచార రథాలను సిద్ధం చేసిన ఎన్నారై టీడీపీ. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో తెలుగుదేశం ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రచారం చేయడం ప్రచార రథాల ప్రధాన ఉద్దేశం. నాలుగున్నరేళ్ళలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమర్థపాలన, పథకాల అమలుపై ప్రజలకు డిజిటల్ స్క్రీన్లపై ప్రదర్శించనున్న రథాలు. ప్రచార రథాల చుట్టూ చిత్రాలతో ప్రభుత్వ పథకాల ప్రదర్శన. రాష్ట్రంలో ఏ గ్రామంలోకి వెళితే అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళిన ప్రవాస భారతీయులతో వారి బంధువులు, స్నేహితులు, స్థానికులతో మాట్లాడే వైఫై, ఫోన్ సౌకర్యం ఉండటం విశేషం. డిజిటల్ ప్రచార రథం అనుసంధానంగా దేశంలోని పలు ప్రాంతాలతోపాటు, ప్రవాసభారతీయులతో సంభాషించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.
ఒకేసారి వందమందితో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ముఖ్యమంత్రుతో మాట్లాడటం సంతోషంగా ఉందన్న ప్రవాసభారతీయులు. విదేశాల్లో ఉన్నా తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలన్న సీఎం. వందశాతం విజయం తెదేపాదేనన్న సీఎం. మీ మద్దతు ప్రత్యక్షంగా కస్కపోయినా, వీడియోలతో మీమీ బంధువులతో తెదేపీకి ఓట్లు వేయించాలన్న సీఎం. ఈసారి ఎన్నికలు చాలా ముఖ్యమైనవన్న సీఎం. ప్రపంచస్థాయి రాజధాని అమరావతి నిర్మాణం చేస్తున్నామన్న సీఎం. రాష్ట్రాభివృద్ధిని దెబ్బతీయడానికు కుట్రలు చేస్తున్న ప్రతిపక్షాలను ఎదుర్కొంటామన్న సీఎం. మీరెక్కడున్నా తెలుగుజాతి ఉన్నతిని ఆకాంక్షించిన దానికి తగ్గట్లుగా తీర్చిదిద్ఫుతామన్న సీఎం. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కల్పించిన అవకాశాలతో ఉన్నతవిద్య అభ్యసించి విదేశాల్లో మంచి హోదాలో ఉన్నామని కృతజ్జ్ఞతలు తెలిపిన ప్రవాసభారతీయులు.
“మీకు మీరేసాటి మీకు లేదు పోటీ, మళ్ళీ మీరే ముఖ్యమంత్రి కావాలన్న” ప్రవాసభారతీయులు. డిజిటల్ ప్రచార రూపకర్త టీడీపీ తెలుగు యువత నాయకులు చిగురుపాటి ధనంజయ, ఏపీ ఎన్నార్టీ సీఈవో వేమూరి రనిని అభినంసించిన సీఎం చంద్రబాబు.













