మంత్రి గంటా పార్టీ మారుతున్నరంటూ వస్తున్న వార్తలను ఖండించిన ముఖ్యమంత్రి
తెలుగుదేశం పార్టీలో వైకాపాకు గతంలోనే రాజీనామా చేసిన వంగవీటి రాధా, తాజాగా రాజీనామా చేసిన ఎడం బాలాజీకు తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా జరిగిన సభలో స్పష్టం చేశారు. ఉండవల్లిలోని ప్రజావేదిక సమీపాన జరిగిన సభలో వంగవీటి రాధా, ఎడం బాలాజీ వారితోపాటు పెద్ద సంఖ్యలో అనుచరులకు సీఎం పసుపు కండువా కప్పి తెదేపాలో చేర్చుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మీడియా హుందాతనం వ్యవహరించాలని హితవు పలికారు. అవాస్తవాలను ప్రసారం చేసి ప్రజలను కన్ప్యూజ్ చేయవద్దని కోరారు. రాజకీయ నాయకుల వ్యక్తిత్వ హననానికి పాల్పడవద్దని పేర్కొన్నారు.గంటా శ్రీనివాసరావు ఉదయం నుంచి చర్చల్లో ఉంటే తెదేపా మారారను, లోటస్ పాండ్ కు వెళుతున్నారని ప్రసారం చేయడం తగదన్నారు. ప్రజల్లో విస్గ్వసనీయత ముఖ్యమన్నారు. సాక్షి పూర్తిగా అసత్యాలు ప్రచారం చేయడమే దినచర్య అని విమర్శించారు.స్వంత ప్రయోజనాలను పొందడానికి వ్యక్తులపై బురద జల్లే కార్యక్రమానికి పూనుకోవడం మంచిదికాదన్నారు. జగన్ ది క్రిమినల్ మనస్తత్వమని గంటా శ్రీనివాసరావు విమర్శించారు. నీతి, న్యాయం, మంచి, మానవత్వం జహన్ లో ఏకోశాన లేవని పేర్కొన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు గొబెల్ ప్రచారానికి దిగిన సాక్షి పత్రిక ట్రాప్ లో పాఠకులు పడవద్దని, నమ్మవద్దని కోరారు.రాజకీయాల్లో ఉన్నత విలువలు పాటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నాయకత్వంలో జీవితాంతం పని చేస్తానని గంటా స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తిరిగి తెలుగుదేశం పార్టీ గెలుపునకు కృషి చేస్తానని పేర్కొన్నారు. వైకాపా, బీజేపీ మధ్య లాలూచీ వ్యవహారం ఉందని ‘టైమ్స్ నౌ’ మీడియా బయటపెట్టిన విషయాన్ని రాధా తెదేపాలో చేరిన సమయంలో జరిగిన సభలో ప్రస్తావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.













