Chandrababu: ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు బర్త్‌డే విషెస్

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) 75వ పుట్టినరోజు (Birthday) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సరైన సమయంలో సరైన నాయకుడు దొరకడం మన అదృష్టమన్నారు. నిబద్ధత, దృఢ సంకల్పంతో దేశాన్ని ఆయన నడిపిస్తున్నారని చంద్రబాబు కొనియాడారు. సబ్ కా సాథ్ , సబ్ కా వికాస్ (Sub ka Vikas) ఆయన చేపట్టిన సాహసోపేతమైన సంస్కరణ అని పేర్కొన్నారు. ప్రజలు దేశ శ్రేయస్సు పట్ల మోదీకి ఉన్న నిబద్ధత ఎంతోమంది జీవితాలను ప్రభావితం చేసిందన్నారు. ఆరోగ్యం, అపరిమిత శక్తితో దేశానికి మరింత సేవ చేయాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.