సిఎం చంద్రబాబుకు సుస్ధిరాభివృద్ధి సదస్సు ఆహ్వానం
ఢిల్లీలో నెల 15 నుంచి మూడు రోజులపాటు జరిగే ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సుకు హాజరై ప్రసంగించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కేంద్ర ఇంధన వనరుల సంస్థ నుంచి ఆహ్వానం అందింది. పునరుత్పాదక ఇంధనం, పొదపు అంశాల్లో మందుచూపుతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ముఖ్యమంత్రి ఆ సదస్సులో వివరిస్తారని రాష్ట్ర ఇందన శాఖ అధికారులు తెలిపారు. వాతావరణ మార్పులను తట్టుకునేందుకు, హరిత ఇందనాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రోత్సహించడంతో పాటు సుస్థిర అభివృద్ధి దిశగా కార్యాచరణను ఈ సదస్సులో రూపొందిస్తారన్నారు. అమరావతి, తిరుపతి, విజయవాడ నగరాల్లో పర్యావరణ హిత వాహనాల వినియోగాన్ని ప్రారంభిస్తామని, ఆనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు.













