దుర్గమ్మ సన్నిధిలో చంద్రబాబు దంపతులు
విజయవాడలోని దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి దర్శనానికి సతీసమేతంగా వచ్చిన చంద్రబాబుకు పాలకమండలి చైర్మన్ గౌరంగబాబు, సభ్యులు, కల్టెక్టర్ బి.లక్ష్మికాంతం, ఈవో సూర్యకుమారి తదితరులు ఆలయ మర్యాదలతో ఘననంగా స్వాగతం పలికారు. సరస్వతీదేవి అలంకారంలోని దుర్గాదేవిని చంద్రబాబు దర్శించుకున్నారు. సీఎం అమ్మవారి దర్శనానికి సంప్రదాయ వస్త్రాల్లో వచ్చారు. మంత్రులు మాణిక్యాలరావు, దేవినేని ఉమ తదితరులు ముఖ్యమంత్రి వెంట ఉన్నారు.













