Chandrababu : వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తాం : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌ని స్వచ్ఛాంధ్రగా చేయాలని సంకల్పించామని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తెలిపారు. నెల్లూరు జిల్లా కందుకూరులో మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ (Material Recovery Facility Center) ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పట్టణాల్లో 85లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. అక్టోబరు 2 నాటికి చెత్త తొలగించే బాధ్యతను మున్సిపల్ శాఖ (Municipal Department ) కు అప్పగించాం. పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు నెలలో ఒకరోజు కేటాయించాలి. ప్రజలు మంచిగా ఆలోచిస్తే రాష్ట్రానికి తిరుగులేదు. చెత్తను పునర్వినియోగం చేసి, సంపద స్పష్టించేందుకు ప్రయత్నిస్తున్నాం. రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం పెంపునకు చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 64 లక్షల మందికి పింఛన్ (Pension) ఇస్తున్నాం. ఇబ్బందుల్లో ఉన్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది. సంపద సృష్టిస్తేనే అభివృద్ధి జరుగుతుంది. నేరస్థుల (Criminals) పట్ల కఠినంగా ఉంటాం. వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తాం. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టం అని హెచ్చరించారు.













