Auto driver: ఏపీలో మరో కొత్త పథకం ప్రారంభం.. వారికి ఏడాదికి రూ.15 వేలు!

కూటమి ప్రభుత్వం మరో కొత్త ఫథకాన్ని నేడు ప్రారంభించనుంది. ఆటో డ్రైవర్ (Auto driver) సేవలో పథకం కింద ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థికసాయం అందించనుంది. తొలి ఏడాది 2,90,669 మంది డ్రైవర్లకు రూ.436 కోట్ల మేర వారి ఖాతాల్లో జమ చేయనుంది. వీరిలో ఆటో డ్రైవర్లు 2,64,197 మంది, ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు 20,072 మంది, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు 6,400 మంది ఉన్నారు. విజయవాడ అజిత్‌సింగ్ నగర్‌లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ప్రారంభిస్తారు.ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) , మంత్రి లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరుకానున్నారు.