Chandrababu: జూన్ లోపు నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తాం : చంద్రబాబు
జూన్ లోపు ప్రభుత్వంలో ఉన్న అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) స్పష్టం చేశారు. పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు (MP), మంత్రులు (Ministers), పార్టీ ఇన్ఛార్జ్లతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ (Teleconference) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారికంటే, పప్పటి నుంచో పార్టీలో ఉండి పనిచేసిన వారిని నేతలు ప్రోత్సహించాలన్నారు. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారికే పదవులు దక్కేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేల (MLA )దేనని తేల్చి చెప్పారు. 214 మార్కెట్ కమిటీలు, 1100 ట్రస్ట్ బోర్డులు ఉన్నాయని, రానున్న రోజుల్లో ఈ నియామకాలు పూర్తి చేస్తామన్నారు. పదవి పొందిన వాళ్ల రెండేళ్ల పనితీరుపై సమీక్ష చేస్తామని తెలిపారు. దాని ఆధారంగా మళ్లీ నిర్ణయాలు, భవిష్యత్ అవకాశాలు ఉంటాయని వివరించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల నియామకంపై ఎమ్మెల్యేలు సరైన ప్రతిపాదనలు పంపాలని సూచించారు. 2029లో మళ్లీ గెలిచేలా ప్రతి ఒక్కరూ పనితీరు ఉండాలని తేల్చి చెప్పారు. 7 నెలల కాలంలో ఎన్నో పథకాలు, కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేపట్టామన్న చంద్రబాబు ఈ విషయాలను నిరంతరం ప్రజలకు వివరించాలని స్పష్టం చేశారు. మెంబర్ షిప్ బాగా చేసిన వారికి పదవుల్లో ప్రోత్సాహం ఇస్తామన్నారు.













