బెంగాల్ పరిణామాలను పార్లమెంట్లో లేవనెత్తండి : ఎంపీలతో బాబు
బెంగాల్లో సీబీఐ చర్య దుర్మార్గం: చంద్రబాబు
పశ్చిమ బెంగాల్లో జరిగిన పరిణామాలను పార్లమెంట్లో లేవనెత్తాలి – అనుమతి తీసుకోకుండా, నోటీసులు ఇవ్వకుండా సీబీఐ అధికారుల జోక్యంపై పార్లమెంట్లో లేవనెత్తాలన్నారు – కేసుపై హైకోర్టులో స్టే ఉన్నప్పటికీ సీబీఐ అధికారులు ఎందుకు వచ్చారన్నదే ప్రశ్న – ఈ అంశంపై బీజేపీయేతర పక్షాల నేతలందరితో మాట్లాడిన చంద్రబాబు సాయంత్రం ఢిల్లీలో అందరూ కలవాలని నిర్ణయించారు – రాజకీయ ప్రత్యర్థులందరిపై కేసులు పెట్టి బీజేపీ నేతలు ఆనందిస్తున్నారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు : టీడీపీ ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు
పశ్చిమ బెంగాల్లో సీబీఐ చర్య దుర్మార్గం – రాష్ట్రాలను తమ నియంత్రణలో ఉంచుకోవాలనే కేంద్ర దుశ్చర్యను ఖండిస్తున్నాం – సమాఖ్య స్ఫూర్తికి ఇది విరుద్ధమని, అంతా ఐక్యంగా పోరాడతాం – అమిత్ షా పలాస పర్యటన రాజకీయ స్వార్థమే అని నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలి – బీజేపీయేతర పక్షాలు ఇవాళ ఈసీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించాం – ఈ విషయం తెలిసే జగన్ హడావుడిగా ఢిల్లీ వెళ్లారని విమర్శించారు – మోదీ కనుసన్నల్లో ఈసీని కలిసి ఫిర్యాదు అని జగన్ నాటకమాడుతున్నారు – తిరుపతిలో గోవిందరాజుల స్వామి ఆలయంలో చోరీ ఉపేక్షించేది లేదు – నిన్న హైకోర్టు నిర్మాణంతో నవ్యాంధ్రలో నవశకం చాటాం – లక్ష్యాలకు అనుగుణంగా నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం జరుగుతోంది : పార్టీ నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి.













