Amaravati: ఆధునిక పరిశోధనల కేంద్రంగా అమరావతి : చంద్రబాబు
ప్రస్తుతం అందరూ క్వాంటమ్ టెక్నాలజీ గురించే ఆలోచిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. వేలాది టెక్ విద్యార్థులతో ఆన్లైన్లో క్వాంటమ్ టాక్ నిర్వహించిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఆధునిక పరిశోధనల కేంద్రంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ (Amaravati Quantum Valley) ఉంటుందని తెలిపారు. అన్ని రంగాల్లోనూ క్వాంటమ్ కంప్యూటింగ్ పనిచేయబోతోందన్నారు. క్యూబిట్, వైసర్ సంస్థలతో కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 1970లో చైనా (China) ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చింది. 1991లో భారత్లో ఆ సంస్కరణలు వచ్చాయి. ఆ తర్వాత ఎక్కడా వెనకి తిరిగి చూడలేదు. వ్యవసాయ రంగంలో సంస్కరణలతో ఆర్థికాభివృద్ధికి ముందడుగు పడిరది. హరిత విప్లవంతో దేశ స్థితిగతులు సమూలంగా మారాయి. ఆహార ధాన్యాల విషయంలో భారత్ స్వయం సమృద్ధి సాధించింది. సామాన్యుల సాధికారతే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం సంస్కరణలు తీసుకొస్తోంది. విశాఖ (Visakha)కు చాలా ఐటీ కంపెనీలు వస్తున్నాయి. భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీ, టెక్నాలజీకి ఆ నగరం చిరునామాగా మారబోతోంది. తిరుపతిలో స్పేస్ సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాం అని అన్నారు.






