ఆయన అధికారంలోకి వస్తే అత్తారింటికి దారి చూపిస్తారు
వైకాపా అధ్యక్షుడు జగన్ అధికారంలోకి జైలుకు, జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ అధికారంలోకి వస్తే అత్తారింటికి దారి చూపిస్తారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా వినుకొండలో నిర్వహించిన రోడ్ షోలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జాబు కావాలంటే మళ్లీ మళ్లీ బాబే రావాలని ఆయన పునరుద్ఘాటించారు. ఉద్యోగాలకు రాచబాట వేస్తానన్నారు. కోడి కత్తి పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు వస్తాయా? అంటూ పరోక్షంగా వైకాపాను ఉద్దేశించి ప్రశ్నించారు. ఎవరు అధికారంలోకి రావాలో తేల్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఐదేళ్లపాటు తాను కష్టపడింది రాష్ట్రం బాగుకోసమేనని అన్నారు. ఆంధ్రులను అవమానిస్తే కేసీఆర్ను వదలిపెట్టబోమని హెచ్చరించారు.













