ఇది నా అదృష్టంగా భావిస్తున్నా : చంద్రబాబు
జన్మభూమి కార్యక్రమానికి అపూర్వ స్పందన వస్తోందని, ఇది తన అదృష్టంగా భావిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బొబ్బిలిలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ని నాలెడ్జ్ హబ్‌గా తయారుచేయాలన్నది తన దృఢ సంకల్పమని అన్నారు. పేదరిక నిర్మూలన విద్య వల్లే సాధ్యమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రపంచాన్ని శాసించే శక్తి భారత్‌కు తప్ప మరే దేశానికి లేదని అన్నారు. పిల్లలను బాలకార్మికులుగా ఉపయోగించుకుంటే క్షమించారని నేరమని అన్నారు. తల్లిదండ్రులకు ఎన్ని కష్టాలున్నా పిల్లలను స్కూల్‌కు పంపాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.













