Simhachalam: 72 గంటల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వండి : సీఎం చంద్రబాబు
సింహాచలం ఘటనపై ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డీజీపీ (DGP), ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఘటన జరిగిన తీరు, బాధితులకు అందుతున్న సాయంపై అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై విచారణకు ముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్ (Suresh Kumar) , ఈగల్ చీఫ్ ఆకె రవికృష్ణ (Ravi Krishna) , ఇరిగేషన్ శాఖ ఇంజినీరింగ్ ఇన్ఛీఫ్ వెంకటేశ్వరరావును సభ్యులుగా చేర్చారు. 72 గంటల్లో ప్రాథమిక నివేదిక అందజేయాలని కమిటీని చంద్రబాబు ఆదేశించారు.













