Chandrababu:స్పేస్ పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష ..లేపాక్షి, తిరుపతి లో
స్పేస్ పాలసీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సమీక్ష నిర్వహించారు. మొత్తం రూ.25 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ (Space Policy) 4.0ని ఆకర్షణీయంగా రూపొందించినట్టు చంద్రబాబు తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా 5వేలు, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. లేపాక్షి (Lepakshi) , తిరుపతి (Tirupati) లో స్పేస్ సిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. స్పేస్ పరిశ్రమలకు 25 నుంచి 45 శాతం వరకు పెట్టుబడి రాయితీలు కల్పిస్తున్నామని వెల్లడిరచారు. విద్యార్థుల (Students)ను భాగస్వాములు చేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. తుది పాలసీ రూపకల్పనపై సీఎం సమీక్ష చేశారు.













