Chandrababu:అమరావతిలో 74 ప్రాజెక్టులు ప్రారంభం : సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం మొత్తం రూ.81,317 కోట్ల మేర పనులను సీఆర్డీయే (CRDA) ప్రతిపాదించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తెలిపారు. అమరావతి (Amaravati) నిర్మాణ పనుల పురోగతిపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాజధానిలో ప్రస్తుతం రూ.50,552 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచినట్లు తెలిపారు. 74 ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. హౌసింగ్, ఇతర భవనాల నిర్మాణాలు, ఎల్పీఎస్ మౌలిక సదుపాయాలతో పాటు రోడ్లు, డక్ట్‌లు, వరద నియంత్రణ పనులు కూడా చేపట్టినట్లు వెల్లడిరచారు. రికార్డు టైమ్‌లో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ (Narayana) , పురపాలక, సీఆర్డీయే, ఏడీసీ ఉన్నతాధికారులు, నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు హాజరయ్యారు.