ఐఏఎస్లకు సీఎం చంద్రబాబు సూచన… ఆ ప్రచారాన్ని తిప్పికొట్టండి
ప్రభుత్వంపై చేస్తోన్న ఫేక్ ప్రచారాలను కౌంటర్ చేయాలని కలెక్టర్లు, అధికారులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మంచిని చెప్పి ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. చెడు జరిగినప్పుడు అది వాస్తవమని తెలిస్తే సాక్ష్యాధారాలతో సహా చెప్పాల్సిన బాద్యత జిల్లా అధికార యంత్రాంగానిది. భట్టిప్రోలులో రెండు గ్రూపులకు మధ్య చిన్న గొడవ జరిగితే, పోలీసుల చొక్కా పట్టుకున్నట్లు చిత్రీకరించారు. కొందరు నకిలీ వ్యక్తులు సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ ఇష్టానుసారంగా దుష్ప్రచారం చేస్తున్నారు అన్నారు. మేం ఎవరినీ రాజకీయ బాధితులను చేయం. తప్పు చేసినవాళ్లను మాత్రం వదిలిపెట్టం. ప్రజాస్వామ్యంలో మళ్లీ తప్పులు చేయాలంటేనే భయపడాలి. 36 మందిని చంచేశారంటూ వైసీపీ నేతలు ఢిల్లీకి వెళ్లి ధర్నా చేశారు. మృతి చెందినవారి పేర్లు ఇవ్వండి. ఎఫ్ఐఆర్ కాపీలు ఇవ్వండి. చర్యలు తీసుకుంటామంటే ఇప్పటివరకు ఇవ్వలేదు. రాజకీయాలు కూడా మారాయి. రాజకీయ నేతలు పేపరు, టీవీలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సహించరానివి అని హెచ్చరించారు.













