Chandrababu: కూనంనేని వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
తెలంగాణ అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(Kunamneni Sambasiva Rao) చేసిన వ్యాఖ్యలను కలెక్టర్ల సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ప్రస్తావించారు. గతంలో చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఇజం లేదు, ఇక టూరిజమే (Tourism) ప్రధానం అనేవారు. ఏ ఇజం లేదంటే అప్పుడు మాకు కోపం వచ్చేది. కానీ, నిజంగా ఖర్చులేని ఇజం ఏదైనా ఉందంటే అది టూరిజమే అని కూనంనేని అలన్నారు. చంద్రబాబు నాడు చెప్పిన మాటే నిజమంటూ ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు. ఏ ఇజం లేదని నేను అంటే కమ్యూనిస్టులు (Communists) నాపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఖర్చు లేని ఇజం టూరిజమేనని స్టేట్మెంట్ ఇచ్చారు. నా మాటలు, ఆలోచనలకు అర్థం చేసుకోవడానికి 30 ఏళ్లు పట్టింది అని నవ్వుతు చంద్రబాబు అన్నారు. అయితే ఇప్పుడంత సమయం లేదని, త్వరగా ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజల జీవితాల్లో మార్పులు తేవాలని సీఎం పేర్కొన్నారు.













