Greater Vijayawada: గ్రేటర్ విజయవాడకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!
గ్రేటర్ విజయవాడ (Greater Vijayawada)ను ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కలను సాకారం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu)కు ఎంపీ కేశినేని శివనాథ్ (Kesineni Shivanath), ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ (Gadde Rammohan) విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి గ్రేటర్ విజయవాడపై నివేదిక సమర్పించారు. దీర్ఘకాలంగా పెండిరగ్లో ఉన్న గ్రేటర్ విజయవాడ ప్రతిపాదనపై చర్యలు తీసుకోవాలని కోరారు. పెనమలూరు, మైలవరం, గన్నవరం నియోజకవర్గాల పరిధిలోని 75 గ్రామాల్లో చాలావరకూ ఇప్పటికే అనధికారికంగా నగరంతో కలిసే ఉన్నాయంటూ ఆ వివరాలను ముఖ్యమంత్రికి ఎంపీ శివనాథ్ చూపించారు. గ్రేటర్ విజయవాడ ఏర్పాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారని ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. వెంటనే గ్రేటర్ ప్రతిపాదనలపై దృష్టి సారించాలంటూ సీఎంఓ సిబ్బందిని ఆదేశించారన్నారు.






